V6 News

మాడ్గుల్ మండల అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయింపు

మాడ్గుల్ మండల అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయింపు

ఆమనగల్లు, వెలుగు : మాడ్గుల్ మండల సర్వతోముఖాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించిందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం మండలంలో బీటీ, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సంక్షేమ ఫలాలు ప్రతి నిరుపేద ఇంటికి అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ గీత, నాయకులు పాల్గొన్నారు.