ఎందన్నా అక్కడ గురి పెట్టావ్: నొప్పితో విలవిలలాడిన సౌతాఫ్రికా క్రికెటర్

ఎందన్నా అక్కడ గురి పెట్టావ్: నొప్పితో విలవిలలాడిన సౌతాఫ్రికా క్రికెటర్

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20 లో సౌతాఫ్రికా బౌలర్ లుంగీ ఎంగిడి.. అనుకోని విధంగా గాయపడ్డాడు. గాయపడటమంటే.. అలా కాదండోయ్. అక్కడ తగిలింది అన్నమాట. దీంతో కాసేపు నొప్పితో విలవిలపోయాడు. ఎంగిడిని అంతలా బాధపెట్టిన బౌలర్ ఎవరో తెలుసా..! మార్కస్ స్టోయినిస్. 

స్టోయినిస్ వేసిన 14 ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదో బంతికి విలియమ్స్ క్యాచ్ ఔట్ గా వెనుదిరగగా.. చివరి బంతిని ఎంగిడి లెగ్ సైడ్ వైపు ఆడబోయాడు. కానీ బంతి అనూహ్యంగా తన దిశను మార్చుకొని ఎంగిడి ఆయువుపట్టును బలంగా తాకింది. అలా తగలరాని చోట బంతి తగలడంతో.. అతను నొప్పి బాధను భరించలేకపోయాడు. కాసేపు కింద కూర్చొని ఎక్సర్సైజులు చేశాడు. అతని పరిస్థితిని గమనించిన ఫిజిషియన్ పరిగెత్తుకుని మైదానంలోకి వచ్చాడు. ఈ సన్నివేశాలు చూసిన ప్రేక్షకులు, సహచర జట్టు ఆటగాళ్ళు నవ్వులు చిందించారు.

కాగా ఈ మ్యాచ్లో పర్యాటక జట్టు ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా పై 111 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 226 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్య చేధనలో ప్రోటీస్ జట్టు 115 పరుగులకే పరిమితమైంది.