వేములవాడ,వెలుగు: హిందువుల ఐక్యతే దేశానికి శక్తి అని కొత్తకోట శివానంద స్వామీజీ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో హిందూ మహా సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా కొత్తకోట శివానంద స్వామీజీ, ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సంఘటనలో శక్తి దాగి ఉందని, హిందూ బంధువులందరూ ఎంత ఐక్యతతో ఉంటే అంత శక్తి లభిస్తుందన్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

