శబరికి వచ్చే చిన్నారులకు RTPCR తప్పనిసరి కాదు

శబరికి వచ్చే చిన్నారులకు RTPCR తప్పనిసరి కాదు

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చే చిన్నారులకు RTPCR టెస్ట్ తప్పని సరికాదని స్పష్టం చేసింది కేరళ ప్రభుత్వం. కోవిడ్ రూల్స్ ప్రకారం..చిన్నారుల దగ్గర శానిటైజర్లు, సబ్బులు  దగ్గర ఉండేలా వారి వెంట వచ్చే పెద్దలు చూసుకోవాలని సూచించింది. అంతేకాదు భౌతిక దూరం పాటించేలా చూడాలంది.

నవంబర్ 16న ప్రారంభమైనే శబరిమల యాత్రలో పాల్గొనే భక్తులు, సిబ్బంది రెండు వ్యాక్సిన్ డోసులు వేసుకోవడాన్ని కేరళ ప్రభుత్వం తప్పని సరి చేసింది. లేదంటే.. RTPCR నెగెటివ్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. వర్షాలు, కరోనా కారణంగా గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా వర్చువల్ క్యూ పద్ధతిలో భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించనున్నారు.