ములుగు జిల్లాలో ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుంది. హైదరాబాద్ నుంచి ములుగుకు ప్రయాణికులతో వస్తుండగా వదరలో చిక్కుకుపోయింది. ములుగు గట్టమ్మ జాకారం మధ్యలో..భారీ వరదకు బస్సు కొంతదూరం కొట్టుకుపోయి..పొలాల మధ్య లో నిలిచిపోయింది.
వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బయటకు రాలేక ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. తమను రక్షించాలంటూ ప్రయాణీకులు కేకలు వేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
