V6 News

బార్ లోకి దూస్కెళ్లిన ఆర్టీసీ బస్సు

బార్ లోకి దూస్కెళ్లిన ఆర్టీసీ బస్సు

ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా తాత్కాలిక డ్రైవర్లు బస్సులు నడుపుతున్నారు. వీరు బస్సులు నడుపుతున్న తీరుతో ప్రయాణికులు బస్సు ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్నారు. సరైన ట్రైనింగ్ లేని డ్రైవర్లతో ప్రతీ రోజు ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా ఖమ్మం జిల్లా బోనకల్ క్రాస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ఓ బార్‌లోకి దూసుకెళ్ళింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు కూడా కొంత డ్యామేజ్ అయింది. సమ్మె విషయంలో ప్రభుత్వం, కార్మికులు వెనక్కి తగ్గడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం హైకోర్టులో ఉంది.