నెలకు 2-3 సార్లు ఏపీ నుంచి వచ్చి ఆర్టీసీ బస్సుల్లో దొంగతనాలు.. నలుగురు ముఠా సభ్యులు అరెస్ట్

నెలకు 2-3 సార్లు ఏపీ నుంచి వచ్చి ఆర్టీసీ బస్సుల్లో దొంగతనాలు.. నలుగురు ముఠా సభ్యులు అరెస్ట్

 వీరిలో ముగ్గురు మహిళలు


ఎల్బీనగర్, వెలుగు: ఏపీ నుంచి హైదరాబాద్​కు వచ్చి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల బ్యాగ్​ల నుంచి బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్న ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తిని ఎల్బీ నగర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నందికొట్కూరుకు చెందిన పాత నేరస్తురాలు తమ్మిశెట్టి వాని అలియాస్ చిట్టి (26), గోగుల దానమ్మ (55), తమ్మిశెట్టి రాజు (32), తమ్మిశెట్టి నాగమణి (26) ఓ గ్యాంగ్​గా మారారు.  

వీరు నెలకు రెండు మూడు సార్లు హైదరాబాద్​కు వచ్చి రద్దీగా ఉన్న ఆర్టీసీ బస్సులను ఎల్బీ నగర్​లో ఎక్కుతున్నారు. వీరిలో వాని, దానమ్మ ఫుట్‌‌ బోర్డ్​లో ఉంటూ.. రాజు, నాగమణి బస్సులోని ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలను గుర్తు తెలియకుండా దొంగిలిస్తున్నారు.

 ఈ నెల 8న కృష్ణా నందిత అనే మహిళ బస్సు ఎక్కుతుండగా ఆమె బ్యాగ్​లోని 6 తులాల బంగారు గాజులను దొంగిలించారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పక్కా ఆధారాలతో సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు.