శబరిమల యాత్ర బస్సులపై 10 శాతం రాయితీ

శబరిమల యాత్ర బస్సులపై 10 శాతం రాయితీ

హైదరాబాద్, వెలుగు: శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల కోసం స్పెషల్ బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. అయ్యప్ప భక్తులు ప్రైవేటు బస్సులను ఆశ్రయించి నష్టపోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శబరిమల యాత్ర బస్సులపై ఎలాంటి డిపాజిట్ లేకుండా10 శాతం రాయితీపై సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఒక్కో బస్సులో ఇద్దరు గురుస్వాములకు, ఇద్దరు వంట మనుషులకు, 12 ఏండ్లలోపు మణికంఠ స్వాములకు, ఒక అటెండర్ కు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి కూడా ప్రయాణం ఉచితమన్నారు. ముందస్తు సీట్ రిజర్వేషన్ లేదా ఆర్టీసీ బస్ బుకింగ్ ల కోసం వెబ్ సైట్ ( www.tsrtconline.in )ను సందర్శించి, అడ్వాన్స్ బుకింగ్ తో పది శాతం డిస్కౌంట్ ను పొందొచ్చన్నారు. పూర్తి వివరాలకు 040 23450033, 69440000 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.    

సమాజంపై ఫొటోల ప్రభావం ఎక్కువ: సజ్జనార్   

ఫొటోలు సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని, ప్రజల్లో చైతన్యం కలిగిస్తాయని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. దేశంలోనే తొలి ట్రావెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటో గ్యాలరీ ‘హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ను  మాదాపూర్ లోని స్టేట్ ఆర్ట్  గ్యాలరీలో శనివారం ఆయన ప్రారంభించారు. ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటో ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఐపీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), ఆర్టీసీ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.