కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్

కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్
  • 90% కాలిన శరీరం.. పరిస్థితి విషమం

ఆర్టీసీ సమ్మెపై సర్కారు తీరుతో ఓ డ్రైవర్ మనోవేదనకు గురై ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. శరీరం 90 శాతం కాలిపోయింది.

ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్నారు. ఖమ్మం నగరంలో ఉంటున్న ఆయన 20 ఏళ్లకు పైగా ఆర్టీసీలో పని చే్స్తున్నారు. కార్మిక సంఘం టీఎంయూలో ఉన్న ఆయన సమ్మెలో పాల్గొంటున్నారు.

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుతో మనస్తాపం గురై ఖమ్మంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణానికి యత్నించారు. దీంతో శరీరం 90 శాతం కాలిపోయింది. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.

సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాతే శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కార్మికులు చెబుతున్నారు. సమ్మెకు వెళ్లిన వాళ్లని ఇక ఉద్యోగాల్లోకి తీసుకునేది లేదని, సెప్టెంబర్ జీతం కూడా సమ్మెలో లేనివారికే అని ప్రకటించడంతో శ్రీనివాస్ రెడ్డి మనస్తాపంతో ఆత్మహత్యాహత్నానికి ప్రయత్నించాడని అంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాహత్నం చేయడంతో ఖమ్మం కలెక్టరేట్ వద్ద విపక్షాలు నిరసనకు దిగాయి. కేసీఆర్.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు విపక్ష నేతలు.