- గత ప్రభుత్వం 55 రోజుల్లో ఒక్క హామీ నెరవేర్చలేదు: మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: కేవలం మూడు రోజుల సమ్మెలోనే కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం రాష్ట్రంలోని డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు 55 రోజుల పాటు సమ్మె చేసినా కనీసం ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు.
ఆ సమయంలో 30 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని, కార్మికులతో కలిసి సంబరాలు చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ నేతల తీరు దారుణమని, ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

