అక్రమాస్తులుంటే ఉరేసుకుంటా : ఆర్టీసీ జేఏసీ కన్వీనర్

అక్రమాస్తులుంటే ఉరేసుకుంటా : ఆర్టీసీ జేఏసీ కన్వీనర్
  • మంత్రి హరీష్ రావు పదవులు శాశ్వతం కాదు. మౌనం వీడండి
  • విలీనంపై కేసీఆర్ హామీ ఇచ్చారు. లేదంటే నా ముక్కు నేలకు రాస్తా
  • ఒక్క వ్యక్తి కి 46 పెట్రోల్  బంకు లు ఎలా ఇచ్చారు
  • పసునూరి దయాకర్ ను బినామీ గా పెట్టి 3 ఎకరాలు భూమిని లాక్కున్నారు
  • నాకు అక్రమాస్తులు ఉన్నాయని నిరూపిస్తే ఉరి వేసుకుంటా

 

ఆర్టీసీ ఆస్థులను కొల్లకొట్టి  మై హోమ్ రామేశ్వర రావు, మేఘా కృష్ణ రెడ్డికి పంచాలని చూస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమ్మె నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన  అశ్వత్ధామ రెడ్డి..  ఖాళీ కడుపులతో ఉద్యమం చేస్తున్నామని, తమ స్వప్రయోజనాల కోసం ఉద్యమం చేయడం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ కర్ణాటక, తమిళనాడు వెళ్లి చూస్తే ఎన్ని బస్సులు ఉన్నాయో తెలుస్తాయని చెప్పారు. ఆర్టీసీని మూసివేయలని కుట్ర చేస్తున్నారన్న అశ్వత్ధామ..రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత ఒక్క బస్ కూడా కొత్తది కొనలేదన్నారు.  

హరీశ్ రావు మౌనం మంచిదికాదు

కరీంనగర్ సభలో  కేసీఆర్  ఇచ్చిన హామీని నెరవేర్చమని కోరుతున్నట్లు చెప్పారు.  కేసీఆర్ విలీనం మాట మాట్లాడలేదు అని టీఆర్ఎస్  నాయకులు అంటున్నారు.  విలీనంపై కేసీఆర్ హామీ ఇచ్చారని తాను నిరూపిస్తానని, లేదంటే ముక్కు నేలకు రాస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో చాలా సార్లు నోటీస్ ఇవ్వకుండా ఉద్యమ చేశామన్నారు.   వయస్సులో  చిన్నవాడైన  ఏపీ సీఎం జగన్ ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేశాడని.. కేసీఆర్ కూడా విలీనం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి హరీష్ రావు మౌనం మంచిది కాదని వ్యాఖ్యానించారు.  పదవులు శాశ్వతం కాదు. మంత్రులు కుమిలి పోకండి. బయటకి రండి ..అందరూ మిమ్ములను భారీ మెజార్టీ తో గెలిపిస్తారని అశ్వత్థామ వెల్లడించారు.

నిరూపిస్తే ఉరి వేసుకుంటా

ఒక్క వ్యక్తి కి  46 పెట్రోల్  బంకు లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు అశ్వత్థామ రెడ్డి.  పసునూరి దయాకర్ ను బినామీ గా పెట్టి  3 ఎకరాలు భూమిని లాక్కున్నారన్నారు. తన ఆస్తులపై  వస్తున్న ఆరోపణలపై స్పందించిన అశ్వత్ధామ రెడ్డి.. బహిరంగ విచారణకు సిద్ధంగా ఉన్నానని , ఏమైనా అక్రమాస్తులు ఉన్నాయని నిరూపిస్తే  ఉరి వేసుకుంటానని సవాల్ చేశారు.