V6 News

ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించాలి : జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న 

ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించాలి : జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న 

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులు సం యమనం పాటించాలని, క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నాలకు పాల్పడి కుటుంబాల ను ఆగం చేయొద్దని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న విజ్ఞప్తి చేశారు. నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

గురువారం హైదరాబాద్​లో మీడియాతో మాట్లాడుతూ.. సమ్మెతో ప్రభుత్వాన్ని ఒప్పించి  సమస్యలను పరిష్కరించుకోవాలే తప్ప  పిరికి వారిలా ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. లక్ష్యాన్ని ముద్దాడే వరకు పోరాడుదామని, పాలకులకు లొంగకుండా హక్కులు సాధించుకుందామని పిలుపునిచ్చారు. ప్రతీ కార్మికుడికి  జేఏసీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.