
ఆర్టీసీ పోరాటం.. ప్రజా పోరాటంలా మారిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. కార్మికుల సమ్మెపై హైకోర్ట్ లో విచారణ జరిగింది. విచారణ అనంతరం యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని, అక్టోబర్ 28లోగా చర్చలు ముగించి స్పష్టమైన నివేదిక అందించాలని హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్ట్ ఉత్తర్వులుపై స్పందించిన అశ్వత్థామరెడ్డి..యాజమాన్యంతో 26 కార్మికుల డిమాండ్లు నెరవేర్చేలా చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. అయితే యాజమాన్యం చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని, చర్చలు చర్చలే..సమ్మె సమ్మేనని అన్నారు. 14రోజులుగా చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశం మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తుందన్నారు. దేశం మొత్తం తెలంగాణ ప్రజా రవాణాను, ఆర్టీసీని బతికించేందుకు అండగా నిలబడ్డారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు.