ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీలో కొత్త యాప్

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీలో కొత్త యాప్

ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. బస్సు ట్రాకింగ్ యాప్ గమ్యం పేరుతో సరికొత్త యాప్‌ను ప్రయాణికుల ముందుకు తీసుకొచ్చింది. 2023 ఆగస్టు 12 శనివారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ టీఎస్‌ఆర్టీసీ గమ్యం యాప్‌ను ప్రారంభించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే టీఎస్ఆర్టీసీ గమ్యం యాప్ లక్ష్యం అని ఎండీ సజ్జనార్ అన్నారు. ఈ యాప్‌తో బస్ ట్రాకింగ్ కనుక్కోవచ్చు.. స్మార్ట్ ఫోన్ లో యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని గమ్య స్థానాలకు వెళ్లే బస్సుల సమాచారం తెలుసుకోవచ్చని సజ్జనార్ తెలిపారు. ముఖ్యంగా మహిళల భద్రత కోసం ఈ యాప్ లో ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. 

ఈ యాప్‌తో బస్ ట్రాకింగ్, దగ్గరలోని బస్సు ఎక్కడుంది, బస్ స్టాప్ల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఎండీ సజ్జనార్ చెప్పారు. బస్ స్టాప్లు లేని దగ్గర ఫ్లాగ్ బస్ ఆప్షన్‌తో మహిళలు బస్సు ఎక్కే సదుపాయాన్ని టీఎస్‌ఆర్టీసీ కల్పించింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఫ్లాగ్ ఎ బస్ ఆప్షన్ అందుబాటులో ఉండేలా ఆర్టీసీ అధికారులు యాప్‌ను రూపొందించారు.