బస్సు ప్రయాణికులకు మరిన్ని సౌలతులు కల్పించాలి : ఎండీ వై. నాగిరెడ్డి

 బస్సు ప్రయాణికులకు  మరిన్ని సౌలతులు కల్పించాలి :  ఎండీ వై. నాగిరెడ్డి
  • అధికారులకు ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి ఆదేశం

హైదరాబాద్, వెలుగు:  బస్సు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను టీజీఎస్ ఆర్టీసీ కొత్త  వైస్ చైర్మన్ అండ్​ మేనేజింగ్ డైరెక్టర్  వై. నాగిరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్​లోని  ప్రధాన బస్ స్టేషన్లు ఎంజీబీఎస్, జేబీఎస్​లను పరిశీలించారు.  ప్రయాణికులకు కల్పిస్తున్న  సౌకర్యాలపై ఆరా తీశారు. 

 శుభ్రత, తాగునీరు, కుర్చీలు, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్ల వంటి అంశాలపై అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఆయా బస్ స్టేషన్ల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల చార్జింగ్ స్టేషన్లను, లాజిస్టిక్స్ కౌంటర్లను పరిశీలించారు. అనంతరం స్వయంగా కొన్ని బస్సుల్లో ఎక్కి..వాటి సాంకేతిక పరిస్థితులను ఆరా తీశారు.