హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ కింద 11శాతం ఫిట్‌మెంట్ ఇస్తే ఏటా సంస్థపై రూ. 377 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు లెక్కతేల్చారు. కార్మికులకు పెరిగే జీతాలకు సంస్థ ప్రతి నెలా రూ. 31. 47 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అసలే పీకల్లోతు అప్పుల్లో ఉన్న ఆర్టీసీ ఇప్పుడు ఈ లోటును ఎలా పూడ్చుకుంటుందనేది ఆసక్తి కరంగా మారింది.
మరోవైపు ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు మూడు రోజులు చేసిన సమ్మెతో రోజుకు రూ.12 కోట్ల చొప్పున రూ. 36 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు యాజమాన్యం ప్రకటించింది.

