హైదరాబాద్‌సిటీ, వెలుగు: నేటి నుంచి మార్చి 13 వరకూ జరిగే ఇంటర్‌పరీక్షల నేపథ్యంలో అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. బాలికలకు మహాలక్ష్మి పథకం కింద, బాలలు హాల్టికెట్చూపిస్తే ఎగ్జామినేషన్సెంటర్ఎక్కడున్నా రూట్పాస్పై ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నామన్నారు.
పాస్‌లేని స్టూడెంట్స్నుంచి సాధారణ ఛార్జీలు తీసుకుంటామన్నారు. పబ్లిక్హాలిడేస్, సెలవు దినాల్లో పరీక్షలున్నా కూడా ఇవి వర్తిస్తాయన్నారు. కన్సెషనల్పాస్ఉన్న స్టూడెంట్స్‌ను ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణించడానికి అనుమతిస్తామన్నారు. ఆయా బస్స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌ను కూడా ఏర్పాటుచేసినట్టు చెప్పారు.
