
హైదరాబాద్, వెలుగు : తమిళనాడులోని అరుణాచలేశ్వరుని గిరి టూర్ ప్యాకేజీకి అనూహ్య స్పందన వస్తోందని ఆర్టీసీ వెల్లడించింది. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన 30 స్పెషల్ సూపర్ లగ్జరీ బస్సుల్లోని సీట్లన్నీ భర్తీ అయ్యాయని తెలిపింది. భక్తుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని మరికొన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ శుక్రవారం ప్రకటించింది . ఈ ప్రత్యేక బస్సులన్నీ శని, ఆదివారాల్లో హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అరుణాచలానికి బయలుదేరుతాయని పేర్కొంది.
మొదట కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనం అనంతరం అరుణాచలానికి చేరుకుంటాయని వివరించింది. అరుణాచలానికి మొదట ఒక ప్రత్యేక బస్సునే ఏర్పాటు చేశారు. దానికి డిమాండ్ పెరగడంతో సర్వీసులను పెంచారు.