
రాష్ట్ర వ్యాప్తంగా 8వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. నిరసనలు, ధర్నాలు, ర్యాలీలతో సమ్మెను ఉధృతం చేస్తున్నారు. సమ్మెలో భాగంగా ఇవాళ డిపోల ముందు కుటుంబ సభ్యులతో కలిసి నిరసన తెలపనున్నారు కార్మిక సంఘాల నేతలు. గాంధీ విగ్రహాల దగ్గర ధర్నాలకు పిలుపు నిచ్చింది ఆర్టీసీ జేఏసీ.
మరోవైపు నిన్న అన్ని పార్టీల నేతలను కలిశారు కార్మిక సంఘాల నేతలు. దీంతో సమ్మెకు మద్దతు ప్రకటించాయి పార్టీలు. అటు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఆందోళనకు పిలుపునిచ్చింది బీజేపీ. కాసేపట్లో బస్ భవన్ ముట్టడికి సిద్దమౌతున్నారు బీజేపీ నేతలు. ఇవాళ మరోసారి అన్ని పార్టీల నేతలతో సమావేశం కానుంది ఆర్టీసీ జేఏసీ. భవిష్యత్ కార్యాచరణ, తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. దసరా సెలవులు ముగియటంలో తిరుగు ప్రయాణం అయ్యారు జనం. సర్కార్ ప్రత్యామ్నాయ చర్యలు సరిపోకపోవటంతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ జనం దగ్గర డబుల్ ఛార్జీలు వసూల్ చేస్తున్నాయి.