ఆర్టీసీ తాత్కాలిక ​కండక్టర్ ​తొలగింపు

ఆర్టీసీ తాత్కాలిక ​కండక్టర్ ​తొలగింపు

ఆర్టీసీ తాత్కాలిక ​కండక్టర్ ​తొలగింపు
అయినా తగ్గని ప్రైవేటు దోపిడీ
గ్రేటర్​ ఆర్టీసీకి భారీ నష్టాలు
తనిఖీలు ప్రారంభించిన ఆర్టీఏ అధికారులు

రోజూ రూ.2కోట్లు ఖర్చు.. రాబడి రూ.70వేలేబస్సుల్లో దోపిడీపై స్పందించిన ఆర్టీఏ అధికారులు ఎన్​ఫోర్స్​మెంట్​ టీంను ఏర్పాటు చేశారు. శుక్రవారం అమీర్ పేట వెళ్లే బస్సులో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్​ కండక్టర్ ను తొలగించారు. ఎవరైనా ఎక్కువ పైసలు అడిగితే డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేయాలని ఆర్టీఏ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాండురంగనాయక్  చెప్పారు. కాగా, సమ్మె కారణంగా గ్రేటర్ ఆర్టీసీకి భారీగా నష్టం వస్తోంది. వారం రోజుల్లో బస్సుల నిర్వహణకు రూ.2 కోట్లు ఖర్చు చేస్తే కనీసం రూ.70 లక్షలు కూడా రాలేదు. రోజూ 600 బస్సులు నడుస్తున్నా.. రూ.15 లక్షలు కూడా రావడం లేదని అధికారులు చెబుతున్నారు. అద్దె బస్సులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో చార్జీలు పెంచి ఎక్కడికక్కడే కమాయిస్తున్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ సమ్మె నగరవాసులకు నరకం చూపుతోంది. ప్రధాన రూట్లు, శివారు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సిటీ బస్సుల కొరత ఉంది.  దీంతో అంబర్ పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు వెళ్లేందుకు క్యాబ్​లో ఒక్కరోజుకు రూ.800 ఖర్చు అవుతోందని రమేష్ అనే ఓ ఉద్యోగి తెలిపారు.

పాస్ లను లెక్క చేయని కండక్టర్లు

ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది రానివ్వమంటున్న అధికారులు పాస్ ల విషయంలో చేతులేత్తేశారు. దీంతో కొత్తగా నియామకం అయిన కండక్టర్లు పాస్ లు చెల్లవని చెప్పేస్తున్నారు. ఇప్పటికే నెల మొత్తానికి పాస్ తీసుకున్న తమ పరిస్థితి ఏమిటని వాపోతున్నారు.

ఎట్టకేలకు తనిఖీలు

ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్న సంఘటనలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో ఎట్టకేలకు ఆర్టీఏ అధికారులు స్పందించారు. శుక్రవారం పలు ప్రధాన రూట్లలో నడుస్తున్న సిటీ బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. అమీర్ పేట్ వెళ్లే బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేసినట్లు గుర్తించి తాత్కాలిక కండక్టర్ ను తొలగించారు. పలు బస్సుల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాండురంగనాయక్ తెలిపారు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు ప్రత్యేక ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

రూ.70 లక్షలు దాటని ఆదాయం

సమ్మె కారణంగా గ్రేటర్ హైదరాబాద్ జోన్ కు పెద్ద ఎత్తున నష్టం వస్తోంది. సాధారణంగా సిటీ బస్సుల ద్వారా రోజుకు రెండున్నర కోట్ల ఆదాయం వస్తుంటుంది. సమ్మె కారణంగా గత వారం రోజుల్లో ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరీ నడిపించిన బస్సుల కారణంగా వచ్చిన ఆదాయం రూ.70 లక్షలు కూడా దాటలేదు. ప్రతి రోజు కనీసం 600 బస్సులను నడుపుతున్నప్పటికీ రూ.15 లక్షల ఆదాయం కూడా రావటం లేదని అధికారులు చెబుతున్నారు. ఇక అద్దె బస్సులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. వారం రోజులుగా అద్దె బస్సుల నుంచి అధికారులు పైసా వసూలు చేయటం లేదు. సిటీ 345 అద్దె బస్సులు ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తూ బస్సులు నడుపుతున్నాయి. గత వారం రోజుల్లో డీజిల్ తో పాటు ఇతర ఖర్చులకు రూ.రెండు కోట్ల కు పైగా ఖర్చు కాగా రూ.70 లక్షల ఆదాయం కూడా రాలేదు. డ్రైవర్లు, కండక్టర్లపై కఠిన చర్యలు తీసుకుందామంటే ఉన్న వారు రాకుండా పోతారని అధికారులు జంకుతున్నారు. ఆటో వాలాలు, క్యాబ్ సర్వీసులు రెండు, మూడు రెట్లు ఛార్జీలు వసూలు చేస్తూ పండుగ చేసుకుంటున్నారు.