- బీఆర్ఎస్ గో బ్యాక్ అంటూ కార్మికుల నినాదాలు
- బీఆర్ఎస్ తీరు వల్లే సమ్మె చేయాల్సి వచ్చిదని ఫైర్
మెహిదీపట్నం, వెలుగు: బీఆర్ఎస్ లీడర్లకు చేదు అనుభవం ఎదురైంది. మెహిదీపట్నం ఆర్టీసీ డిపో వద్దకు వచ్చిన బీఆర్ఎస్ నేతలను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. శుక్రవారం మెహిదీపట్నం ఆర్టీసీ డిపో వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు స్థానిక కార్వాన్, నాంపల్లి బీఆర్ఎస్ నేతలు ఆనంద్ గౌడ్, జీవన్ సింగ్ తమ అనుచరులతో వచ్చారు.
వీరిని చూసిన కార్మికులు ‘గో బ్యాక్ బీఆర్ఎస్’ అంటూ నినాదాలు చేశా రు. గత బీఆర్ఎస్ప్రభుత్వం తీరు వల్ల తాము 55 రోజులు సమ్మె చేయాల్సి వచ్చిందని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్లీడర్లు పక్కకు వెళ్లి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

