నేడు ఆర్టీసీ కార్మికుల మానవహారాలు : అశ్వత్థామరెడ్డి

నేడు ఆర్టీసీ కార్మికుల మానవహారాలు : అశ్వత్థామరెడ్డి

ఎంజీబీఎస్​లో మహిళా కార్మికుల దీక్షలు
సీఎం మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నం
ఆయన స్పందనను బట్టి కార్యాచరణను ప్రకటిస్తం
మీడియాతో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌‌‌‌ అశ్వత్థామరెడ్డి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద ఆదివారం ప్రొఫెసర్‌‌‌‌ జయశంకర్‌‌‌‌ సార్​కు, ఆర్టీసీ అమరులకు కార్మికులు నివాళులర్పిస్తారని, మానవహారాలు నిర్వహిస్తారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌‌‌‌ అశ్వత్థామరెడ్డి చెప్పారు. హైదరాబాద్‌‌‌‌లోని ఎంజీబీఎస్‌‌‌‌లో మాత్రం మహిళా కార్మికులంతా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా దీక్షలు చేపడుతారని వెల్లడించారు.  ఆర్టీసీ సమ్మెపై శనివారం ఎంజీబీఎస్‌‌‌‌లో ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు.

అనంతరం కో కన్వీనర్​ రాజిరెడ్డితో కలిసి అశ్వత్థామరెడ్డి మీడియాతో  మాట్లాడారు. షరతులు లేకుండా డ్యూటీలోకి చేర్చుకోవాలంటూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని, ఇదే విషయంపై ఆర్టీసీ ఇన్‌‌‌‌చార్జి ఎండీ సునీల్‌‌‌‌ శర్మకు త్వరలో లేఖ రాస్తామని చెప్పారు. ఆర్టీసీపై సమీక్షలో సీఎం కేసీఆర్‌‌‌‌ సంస్థను కాపాడే దిశగా మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం