ఆర్టీసీ డిపోల ముందు కార్మికుల నిరసన

ఆర్టీసీ డిపోల ముందు కార్మికుల నిరసన

రాణిగంజ్ డిపో డ్రైవర్ ఆత్మహత్యకు నిరసనగా.. రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ముందు నిరసనలకు దిగారు ఆర్టీసీ కార్మికులు.  డ్యూటీలు ఇవ్వకుండా కార్మికులను అధికారులు వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. సూర్యాపేట ఆర్టీసీ డిపో ముందు కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్లరిబ్బన్లు ధరించి, మౌనం పాటిస్తూ విధులకు హాజరయ్యారు. 

సికింద్రాబాద్ రాణిగంజ్ ఒకటో డిపోకు చెందిన తిరుపతి రెడ్డి అనే ఆర్టీసీ డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం డిపోకు వచ్చిన తిరుపతి రెడ్డికి... అధికారులు డ్యూటీ ఇవ్వలేదు. దీంతో డిపో ముందే... పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తోటి కార్మికులు ఉస్మానియా హాస్పిటల్ కు తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు. అధికారుల వేధింపులతోనే తిరుపతి రెడ్డి సుసైడ్ చేసుకున్నట్లు ఆర్టీసీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.