V6 News

ఆర్టీసీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే నిర్ణయం.. గాంధీ భవన్లో సంబురాలు

ఆర్టీసీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే నిర్ణయం.. గాంధీ భవన్లో సంబురాలు
  •     మెట్టు సాయి, మోతె రోహిత్ 

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చడంతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. గాంధీ భవన్ లో రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి, ఖైరతాబాద్​ డీసీసీ ప్రెసిడెంట్​ మోతె రోహిత్​ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పటాకులు కాల్చి, స్వీట్లు పంచి, డప్పు చప్పుళ్ల మధ్య డ్యాన్సులు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. 

సీఎం రేవంత్​రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఆర్టీసీ చరిత్రలో ఈ నిర్ణయం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీ కార్మికులు 55 రోజులు సమ్మె చేస్తే. ఒక్క హామీ అమలు కాలేదని, పైగా 35 మంది కార్మికులు చనిపోయారని గుర్తు చేశారు. అదే తమ ప్రభుత్వం కేవలం మూడు రోజుల సమ్మెలో ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లను నెరవేర్చిందని సాయి గుర్తు చేశారు.