ఆసక్తికరంగా రుహనీ శర్మ 'HER' చాప్టర్ 1 ట్రైలర్

ఆసక్తికరంగా రుహనీ శర్మ 'HER' చాప్టర్ 1 ట్రైలర్

'చి ల సౌ' మూవీతో తన నటన తో తెలుగు ఇండస్ట్రీకు పరిచమైన నటి రహానీ శర్మ(Ruhani Sharma). తను లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ 'HER' చాప్టర్ 1.  ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం హై ఇంటెన్సి కలిగిస్తోంది. తాజాగా హర్ మూవీ ట్రైలర్ ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిలీజ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ మంచి హైప్ ను క్రీయేట్ చేస్తోంది.

ఒక అమ్మాయి మర్డర్ నేపథ్యంలో సాగిన ఈ ట్రేలర్ లో చూపించిన ప్రతి షాట్..సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా చేస్తోంది. ముళ్ల పొదల్లో చనిపోయిన అమ్మాయి డెడ్ బాడీను రుహనీ పరిశీలిస్తూ.. కేసును ఛేదించే టైం లో వచ్చే ప్రతి డైలాగ్ స్టోరీపై ఆసక్తిని కలిగిస్తోంది. 

ఈ మూవీలో వికాస్, వశిష్ట, అభిగ్న్య సంజయ్ స్వరూప్ బెనర్జీ రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  పవన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కాగా ఈ మూవీ జూలై 21 2023న థియేటర్లలోకి రానుంది.

ఇప్పటికే HER పోస్టర్స్ టీజర్ ట్రైల్ లు సినిమాపై హైప్ పెంచేశాయి. మరి ఈ మూవీ ఆమె కెరీర్ కి ఎంత వరకు ఫస్ల్ అవుతుందో లేదో చూడాలి. ఇక రీసెంట్ గా డైరెక్టర్ శైలేష్ కొలను, విక్టరీ వెంకటేష్ 'సైంధవ్' మూవీలో డాక్టర్ రేణుకగా పరిచయం చేసిన విషయం తెలిసేందే.