బాలయ్య రూల‌ర్ ఆఫ్ హార్ట్స్

బాలయ్య రూల‌ర్ ఆఫ్ హార్ట్స్

బాల‌‌కృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ రూపొందిస్తున్న ‘రూలర్’ ఈ నెల 20న విడుదల కానున్న క్రమంలో వైజాగ్​లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ట్రైలర్​ను రిలీజ్ చేసిన బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘కె.ఎస్‌‌.ర‌‌వికుమార్‌‌గారు త‌‌మిళంలో చేసిన సినిమాల‌‌న్నీ మాలాంటి ద‌‌ర్శ‌‌కుల‌‌కు రిఫరెన్స్​లా ఉపయోగడపడుతున్నాయి. ఆయన డైరెక్షన్‌‌లో రెండోసారి బాలకృష్ణగారు నటించిన ఈ సినిమా సూప‌‌ర్ డూప‌‌ర్‌‌ హిట్ట‌‌వుతుంది. ఈ టైటిల్‌‌ను నేను రిజిష్ట‌‌ర్ చేసి, సాంగ్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు ఆ టైటిల్ బాల‌‌య్య‌‌బాబుగారికే ద‌‌క్కింది. రూల‌‌ర్ ఆఫ్ ఆర్ట్స్.. రూల‌‌ర్ ఆఫ్ హార్ట్స్‌‌ బాల‌‌య్య‌‌. ఆయ‌‌న న‌‌టించిన ఈ సినిమా ఘ‌‌న విజ‌‌యం సాధించాల‌‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. రాజ‌‌శేఖ‌‌ర్ మాట్లాడుతూ  ‘నేను ఇండ‌‌స్ట్రీకి వచ్చిన త‌‌ర్వాత నాకు ఎక్కువ స‌‌పోర్ట్ అందించిన వ్య‌‌క్తి బాల‌‌కృష్ణ‌‌గారే. ఆయ‌‌న తండ్రి ఎన్టీఆర్‌‌గారు రూల‌‌ర్‌‌. ఆయ‌‌న కొడుగ్గా పెరిగిన బాల‌‌కృష్ణ‌‌గారు రూల‌‌ర్ అంటే ఏంటో తెలుసుకున్న వ్య‌‌క్తి. అలాంటి వ్య‌‌క్తి రూల‌‌ర్ అనే ఓ సినిమా చేస్తే ఎంత బావుంటుందో ప్ర‌‌త్యేకంగా చెప్ప‌‌న‌‌క్క‌‌ర్లేదు. అదీ కె.ఎస్‌‌.ర‌‌వికుమార్ లాంటి సూప‌‌ర్ డైరెక్ట‌‌ర్‌‌తో. సినిమా ఇండ‌‌స్ట్రీకి వ‌‌చ్చిన‌‌ప్పటి నుండి క‌‌ల్యాణ్‌‌గారితో ప‌‌రిచ‌‌యం ఉంది. ఇంత మంది నాకు కావాల్సిన వ్య‌‌క్తులు చేసిన ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌‌ని కోరుకుంటున్నాను’ అన్నారు.

కె.ఎస్‌‌.ర‌‌వికుమార్ మాట్లాడుతూ ‘జైసింహా త‌‌ర్వాత మా కాంబినేష‌‌న్‌‌లో వ‌‌స్తున్న సినిమా ఇది. టీమ్ అంతా ప్రారంభం నుండి ఇప్ప‌‌టి వ‌‌ర‌‌కు ఎంత‌‌గానో క‌‌ష్ట‌‌ప‌‌డ్డారు.  అంద‌‌రికీ థ్యాంక్స్‌‌’  అన్నారు. నిర్మాత సి.క‌‌ల్యాణ్ మాట్లాడుతూ ‘ఇది పండ‌‌గ‌‌లాంటి సినిమా. మీసం మెలేసి మాట్లాడేలా ఉంటుంది. క్యాస్టింగ్‌‌, ఖ‌‌ర్చు ఎక్కువ‌‌గా ఉండే ఈ సినిమాని రవికుమార్​గారు ఐదు నెల‌‌ల్లోనే పూర్తి చేశారు. సంక్రాంతి భోజ‌‌నాన్ని 25 రోజుల ముందుగానే ఇస్తున్నాం’ అన్నారు. బాల‌‌కృష్ణ మాట్లాడుతూ ‘నేను, కల్యాణ్‌‌, కె.ఎస్‌‌.ర‌‌వికుమార్ క‌‌లిసి చేసిన జైసింహా సినిమాను ప్రేక్ష‌‌కులు ఆద‌‌రించారు. ఆ స్ఫూర్తితోనే ఈ సినిమా చేశాం. మొదట మ‌‌రో క‌‌థ‌‌ అనుకున్నాం. కానీ అది కుదరక ప‌‌రుచూరి ముర‌‌ళిగారికి ఫోన్ చేశాను. ఆయ‌‌న ఈ క‌‌థ‌‌ను వినిపించారు. న‌‌చ్చ‌‌డంతో వెంట‌‌నే సినిమా చేయాల‌‌ని నిర్ణ‌‌యించుకున్నాను. నాకు రైతుల మీద సినిమాలు చేయాల‌‌ని చాలా కోరిక ఉండేది. ఈ సినిమాతో అది కొంత తీరింది. మా సినిమా త‌‌ప్ప‌‌కుండా అంద‌‌రినీ మెప్పించేలా ఉంటుంది’ అన్నారు. హీరోయిన్లు వేదిక, సోనాల్‌‌ చౌహాన్‌‌తో పాటు నందమూరి రామకృష్ణ, సౌతిండియా ఫిలిం చాంబ‌‌ర్ అధ్య‌‌క్షుడు ర‌‌వి కొటాకర్, గంటా శ్రీనివాసరావు, అంబికా కృష్ణ, జీవిత తదితరులు పాల్గొన్నారు.