
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్ లో రన్నింగ్ కారులో మంటలు చెలరేగి, సగం వరకూ దగ్ధమైంది. శుక్రవారం రాత్రి సైబర్ టవర్ నుంచి బయోడైవర్సిటీ వైపు వెళ్తున్న కారు.. మైండ్ స్పేస్ సమీపంలోకి రాగానే, ఇంజిన్నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును పక్కకు ఆపి బయటకు పరుగులు తీశాడు. సమాచారం అందుకున్న మాదాపూర్ ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో కారు సగం వరకు కాలిపోయింది. ప్రమాదం కారణంగా సైబర్ టవర్ నుంచి మైండ్ స్పేస్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు మంటల్లో కాలిపోయిన కారును పక్కకు జరిపించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.