అగ్ర రాజ్యం అమెరికాలో పెరుగుతున్న రెసిషన్ భయం ఒకవైపు, ఈస్ట్ ఏషియాలో నెలకొన్న యుద్దవాతావరణం వెరసి దేశీయ స్టాక్ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావం రూపాయి మారకం విలువపై కూడా పడింది.ఈక్విటీ మార్కెట్లతో పాటు దేశీయ కరెన్సీ రూపాయి విలువ కూడా గణనీయంగా పతనమైంది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 83.80కి దిగజారి ఆల్ టైమ్ లోకు పడిపోయింది రూపాయి.
ఇండియన్ ఈక్విటీ మార్కెట్లలో భారీ స్థాయిలో రిట్రీట్, విదేశీ నిధుల తరలింపు కారణంగా దేశీయ యూనిట్‌లో భారీ పతనం సంభవించిందని ఫోరెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో లోకల్ యూనిట్ 83.78 వద్ద ప్రారంభమైంది. అమెరికన్ కరెన్సీతో పోలిస్తే 83.80 వద్ద ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది, ప్రీవియస్ క్లోస్ తో పోలిస్తే 8 పైసల పతనాన్ని నమోదు చేసింది రూపాయి .
గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న నెగిటివ్ ఇండికేషన్స్ కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనమైన క్రమంలో సోమవారం ( ఆగస్టు 5, 2024 ) ఇండియన్ స్టాక్ మార్కెట్లు భారీ స్థాయిలో పడిపోయాయి. ఆరంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ, సెన్సెక్స్ రెండు సూచీలు తీవ్ర నష్టాలను నమోదు చేశాయి. ఆరంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 1,500 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ ఏకంగా 1,533.11 పాయింట్లు పతనమై 79,448.84 వద్ద, నిఫ్టీ 463.50 పాయింట్లు నష్టపోయి 24,254.20 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.