Stock Market : ఈ 3 కారణాలతోనే 17 లక్షల కోట్ల జనం డబ్బులు పోయాయి

Stock Market : ఈ 3 కారణాలతోనే 17 లక్షల కోట్ల జనం డబ్బులు పోయాయి

ఇండియన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. సెన్సెక్స్ ఏకంగా 2 వేల 500 పాయింట్లు.. నిఫ్టీ 750 వరకు పడిపోయింది. ఇంతలా స్టాక్ మార్కెట్ ఢమాల్ కావటానికి.. జనం పెట్టిన లక్షల కోట్ల పెట్టుబడి మాయం కావటానికి కారణాలు ఏంటీ.. ఎందుకు ఇంత దారుణంగా స్టాక్ మార్కెట్ పడిపోయింది అనే దానికి.. ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. తెలుసుకుందాం.. రాబోయే రోజుల్ల్ జాగ్రత్తగా ఉందాం..

కారణం 1 : అమెరికాలో ఆర్థిక మాంద్యం

అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింది. కంపెనీల్లో ఉద్యోగాల కోతతోపాటు కొత్త ఉద్యోగాల నియామకాలు 50 శాతం తగ్గాయి. 2023 జూలై నెలలో అమెరికాలో 2 లక్షల 15 వేల ఉద్యోగాలు కొత్తగా వస్తే.. 2024, జూలై నెలలో ఆ సంఖ్య లక్షా 14 వేలకు పడిపోయింది. అంటే 50 శాతం ఉద్యోగాలు.. నెలావారీగా పడిపోయాయి. నిరుద్యోగం రేటు 4.3 శాతానికి పెరిగింది. మూడేళ్లలో ఇదే అత్యధికం. అమెరికాలో ఆర్థిక మాంద్యం సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న వార్తల క్రమంలోనే.. అమెరికా స్టాక్ మార్కెట్లు దారుణంగా పడిపోయాయి. ఎంతలా అంటే.. నాలుగేళ్ల తర్వాత అత్యంత దారుణంగా అక్కడి మార్కెట్లు పడిపోయాయి. ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్ పైనా పడింది.

కారణం 2 : వడ్డీ రేట్లు పెంచిన జపాన్ 

బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను పెంచింది. అది కూడా తన బెంచ్ మార్క్ కంటే ఎక్కువగా ఉండటంతో.. జపాన్ రూపీ విలువ పెరిగింది. ఇదే సమయంలో అమెరికా డాలర్ విలువ తగ్గింది. జపాన్ వడ్డీ రేట్లను పెంచటం ద్వారా తన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నమే అయినా.. జపాన్ కరెన్సీలో అప్పులు తీసుకోవటం, పెట్టుబడులు పెట్టడం ద్వారా.. అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. దీంతో పెట్టుబడిదారులు జపాన్ స్టాక్ మార్కెట్ నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో జపాన్ స్టాక్ ఎక్చేంజ్ సైతం 225 పాయింట్లు నష్టపోయింది. ఇది 7 శాతంగా నమోదైంది. ఈ ప్రభావం అమెరికాతోపాటు మిగతా దేశాలపై పడింది.

కారణం 3 : ఇజ్రాయిల్.. ఇరాన్ యుద్ధ వాతావరణం

హిబుల్లా సైనిక అధినేత హత్యకు ప్రతీకారంగా.. ఇజ్రాయెల్ పై యుద్ధం చేస్తామంటూ ఇరాన్ ప్రకటించటంతో పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్మేశాయి. యుద్ధం వస్తే ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తామని ప్రకటించటంతో యుద్ధం తప్పదనే సంకేతాలు వచ్చాయి. ఈ ప్రభావంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి అన్ని దేశాలు. ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు యుద్ధంతో ఆయిల్ ధరలు పెరిగితే.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలోనే అన్ని దేశాల్లోని స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. 

మిగతా ఎన్ని కారణాలు అయినా ఉండొచ్చు.. ముఖ్యంగా ఈ మూడు కారణాలతోనే ఇండియన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఏకంగా 17 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి సంపద ఆవిరి అయ్యింది.