మంత్రి వివేక్ చొరవతో కొత్త కరెంట్ లైన్

మంత్రి వివేక్ చొరవతో కొత్త కరెంట్ లైన్

జైపూర్ (వెలుగు) వెలుగు: భీమారం మండల కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీలో ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్​లో ఉన్న కరెంట్ లైన్ సమస్య  మంత్రి వివేక్ వెంకట స్వామి చొరవతో  పరిష్కారమైందని కాంగ్రెస్ లీడర్ ఉస్కమల్ల పు న్నం చందు అన్నారు.

గురువారం ఆ కాలనీలో విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ పోల్స్ వేశారని తెలిపారు. దీంతో కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. కార్య క్రమంలో పార్టీ లీడర్లు,  కాలనీ ప్రజలు పాల్గొన్నారు.