ఎస్టీలకు రిజర్వేషన్​ కల్పించిన ఘనత కాంగ్రెస్ దే : భూపతిరెడ్డి

ఎస్టీలకు రిజర్వేషన్​ కల్పించిన ఘనత కాంగ్రెస్ దే : భూపతిరెడ్డి

ధర్పల్లి, వెలుగు: ఎస్టీలకు రిజర్వేషన్​ కల్పించిన ఘనత కాంగ్రెస్​ పార్టీదేనని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. ధర్పల్లి మండల కేంద్రంలో గురువారం రామారావ్​ మహరాజ్​ విగ్రహావిష్కరణ మూడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఫొటోకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజనుల ఐకమత్యానికి రామారావ్​ మహరాజ్​ఎంతో కృషి చేశారని, ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు.

గిరిజనులకు పోడుభూములు అందిస్తామని, అందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందన్నారు. ఆరుగ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని, ఇదే వరకే రెండింటిని అమలు చేయగా, వారం, పది రోజుల్లో మరో రెండు గ్యారంటీలను అమలు చేయబోతున్నామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు ఆర్మూర్​ చిన్నా బాల్​రాజ్, లాల్​సింగ్ నాయక్, తారాచంద్​ నాయక్​ పాల్గొన్నారు.

విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తాం

ఇందల్వాయి: అత్యున్నత ప్రమాణాలతో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని రూరల్​ఎమ్మెల్యే డాక్టర్​ భూపతిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మండలంలోని తిర్మన్​పల్లి వద్ద ఉన్న ట్రైబల్ ​వెల్ఫేర్​ స్కూల్​లో రూ.5 కోట్లతో నిర్మించనున్న బిల్డింగ్​లకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఉన్నత విద్య అందించడమే కాంగ్రెస్​ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. గతంలోనూ ఫీజు రియెంబర్స్​మెంట్​ను ప్రవేశపెట్టి సామాన్యులందరికీ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.ఎంపీపీ రమేశ్​ నాయక్, కాంగ్రెస్​మండలాధ్యక్షుడు నవీన్​గౌడ్, లీడర్లు ఇమ్మడి గోపి, గంగారెడ్డి, శేఖర్​ గౌడ్​ పాల్గొన్నారు.