పుతిన్ హత్యకు ఉక్రెయిన్ కుట్ర.. మాకు సంబంధం లేదన్న జెలెన్‌స్కీ

పుతిన్ హత్యకు ఉక్రెయిన్ కుట్ర.. మాకు సంబంధం లేదన్న జెలెన్‌స్కీ

రష్యా–ఉక్రెయిన్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా, క్రెమ్లిన్‌పై దాడికి యత్నించిన రెండు డ్రోన్లను రష్యా కూల్చివేసింది. ఇది ఉక్రెయిన్ పనేనని, తమ అధ్యక్షుడు పుతిన్‌ను హతమార్చేందుకే వీటిని ప్రయోగించిందని రష్యా ఆరోపించింది. క్రెమ్లిన్‌పై దాడికి యత్నించిన రెండు డ్రోన్లను కూల్చివేసినట్టు వెల్లడించింది. డ్రోన్ల దాడి నుంచి పుతిన్ సురక్షితంగా తప్పించుకున్నారని, ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని క్రెమ్లిన్ ప్రకటించింది. డ్రోన్ దాడి జరిగినప్పుడు పుతిన్ ఆ భవనంలో లేరని పేర్కొంది. అలాగే, క్రెమ్లిన్ భవనానికి ఎలాంటి నష్టం జరగలేదని రష్యా పేర్కొంది. ఇది ఉగ్ర దాడి అని, పుతిన్ ను హత్య చేసేందుకు పన్నిన కుట్ర అని తెలిపింది రష్యా. 

అయితే డ్రోన్ దాడి ఉక్రెయిన్ చేసినట్లు రష్యా చబుతున్నప్పటికీ అందుకు తగిన ఆధారాలు వెల్లడించాలేదు, కానీ సరైన సమయంలో ఉక్రెయిన్ దీటుగా సమాధానం ఇస్తామని రష్యా తెలిపింది. కాగా, మరోవైపు రష్యా చేసిన ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించింది. ఆ డ్రోన్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అధికార ప్రతినిధి మిఖాయ్లో పోడోల్యాక్ తెలిపారు. క్రెమ్లిన్‌పై ఉక్రెయిన్ దాడిచేయబోదని, ఎందుకంటే మిలటరీ లక్ష్యాలను అది పరిష్కరించలేదని పేర్కొన్నారు. అయితే రానున్న రోజుల్లో రష్యా చేయనున్న దాడులను సమర్ధించుకోవడానికే క్రెమ్లిన్ తమపై ఇటువంటి ఆరోపణలు చేస్తోందిని ఉక్రెయిన్ తెలిపింది.