రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఐఫోన్లు బ్యాన్

రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం..  ఐఫోన్లు బ్యాన్

రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఆమెరికాలో తయారైన  యాపిల్ ఐఫోన్లను ప్రభుత్వ అధికారులు ఉపయోగించకుండా నిషేదించింది.   దేశంలోని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSS) ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లను ఉపయోగించడం మానేయాలని వేలాది మంది అధికారులను ఆదేశించింది. 2023  జూలై 17 నుండి నిషేధం  అమలులోకి వస్తుంది. ఇక నుంచి వాణిజ్య మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులు ఇకపై ఆఫీసుల్లో ఐఫోన్‌లను ఉపయోగించడానికి అనుమతించబడరని నివేదికలో వెల్లడించారు. 

క్రెమ్లిన్, ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ గూఢచారి ఏజెన్సీలో ఆందోళన పెరుగుతుంది. క్రెమ్లిన్‌లోని వివిధ మంత్రిత్వ శాఖలు, సంస్థలలో యాపిల్ ఉత్పత్తులను వెంటనే నిషేదించాలని తెలిపారు. అమెరికా గూఢచర్య సంస్థల గూఢచర్య ప్రయత్నాల పెరుగుదలతో రష్యా సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మంత్రిత్వ శాఖలోని అధికారులు ఐఫోన్స్ వాడటం సురక్షితం కాదని వాటికి బదులు  ప్రత్యామ్నాయ మొబైల్ ఫోన్స్ వినియోగించాలని ఓ అధికారి వెల్లడించారు.