ఉక్రెయిన్​పై ప్రతీకారం తీర్చుకున్నం..

ఉక్రెయిన్​పై ప్రతీకారం తీర్చుకున్నం..

మాస్కో : తూర్పు ఉక్రెయిన్​లో టెంపరరీ క్యాంపులు ఏర్పాటు చేసుకున్న సైనిక స్థావరాలపై రాకెట్లతో దాడి చేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయం క్రమటోర్క్‌‌‌‌‌‌‌‌స్‌‌‌‌పై జరిపిన దాడిలో 600 మంది ఉక్రెయిన్​ సైనికులు చనిపోయారని ప్రకటించింది. తమ ఆధీనంలో ఉన్న డాన్‌‌‌‌టెస్క్‌‌‌‌ ఏరియా.. మకివ్కాలోని రష్యన్ బ్యారక్స్‌‌‌‌పై ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్ దాడి చేసిందని చెప్పింది. ఈ ఘటనలో 89 మంది రష్యన్స్​ చనిపోయారని, దీనికి ప్రతీకారంగానే ఈ దాడి చేశామని రష్యా ప్రకటించింది.

ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉక్రెయిన్​ ఆర్మీని లక్ష్యంగా చేసుకొని అటాక్​ చేశామని చెప్పింది. ఒక బిల్డింగ్​లో 700 మంది, రెండో బిల్డింగ్​లో 600 మంది ఉక్రెయిన్​ సైనికులు ఉన్నారని, వీరిలో 600 మందికి పైగా చనిపోయినట్టు తెలిపింది. అయితే, ఈ విషయం నమ్మలేమని రాయిటర్స్ రిపోర్టర్లు అంటున్నారు. రాకెట్లతో దాడి జరిగిన ఆనవాలు లేవని తెలిపారు. డెడ్​బాడీలు, రక్తపు మరకలు కూడా కనిపించలేవని చెప్పారు. కాగా, ఆదివారం తెల్లవారుజామున తూర్పు ఉక్రెయిన్ నగరంలోని కొన్ని బిల్డింగ్స్​పై రష్యా దాడి చేసిందని, అయితే ఈ అటాక్​లో ఎవరూ చనిపోలేదని క్రమటోర్క్​స్​ మేయర్​ తెలిపారు.