
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లోని చాసివ్ యార్ పట్టణంలోని అపార్ట్‌మెంట్‌పై రష్యా రాకెట్‌తో దాడి చేసింది. ఈ ఘటనలో 15 మంది చనిపోయారని, ఇంకా 20 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుపోయారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. గాయపడిన వారిని దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లామని వివరించారు. శనివారం అర్ధరాత్రి టైంలో ఈ ఎటాక్ జరిగిందని తెలిపారు. జనాలు నివాసం ఉండే ఏరియాలను టార్గెట్ చేసుకుని రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయని అధికారులు ప్రకటించారు. జూన్‌లో ఓ షాపింగ్‌మాల్‌పై రష్యా దాడి చేయగా.. 19 మంది చనిపోయారని, ఈ నెలలో దక్షిణ ఒడెస్సాలోని అపార్ట్‌మెంట్‌పై చేసిన ఎటాక్‌లో 21 మంది మరణించారని వివరించారు. ఉక్రెయిన్ మిలటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకుని తాము దాడులు చేస్తున్నామని రష్యా చెబుతోందని, కానీ సాధారణ జనాలనే టార్గెట్ చేస్తోందని డోనెట్స్క్ గవర్నర్ పావ్లో కైరిలెంకో విమర్శించారు. చాసివ్ యార్ పట్టణంపై చేసిన దాడిలోనూ సాధారణ జనాలే చనిపోయారని, అయినా రష్యా మాత్రం ఉక్రెయిన్ బలగాలపైనే దాడి చేస్తున్నామని ప్రకటిస్తోందని అన్నారు. శిథిలాల కింద ఇరుక్కుపోయిన ముగ్గురిని ఉక్రెయిన్ ఆర్మీ కాపాడిందని, మరికొంత మంది ఉన్నట్టు అనుమానిస్తున్నామని తెలిపారు. రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపడుతోందని ప్రకటించారు.