రష్యా రాక్షసుడు.. 14 ఏళ్లు బంధించాడు.. 1000 సార్లకు పైగా..

రష్యా రాక్షసుడు.. 14 ఏళ్లు బంధించాడు.. 1000 సార్లకు పైగా..

పురాణాల్లో రాక్షసులు పేర్లు విన్నాం.. వారు చేసే దారుణాలు అఘాయిత్యాలు.. ఇలా అనేకంగా చేసేవారని.. వారిని హతమార్చేందుకు రాముడు, కృష్ణువు, విష్ణువు లాంటి దేవుళ్లు పలు అవతారాల్లో జన్మించారని  వేదాలు చెబుతున్నాయి.  అయితే ఇవన్నీ నిజంగా జరిగాయా అంటే ఎవరి విశ్వాసం వారిది.. ఎవరి నమ్మకం వారిది.  కాని రష్యాలో నిజంగా ఓ వ్యక్తి రాక్షస అవతారం ఎత్తాడు.  అతడు ఓ మహిళను 14 ఏళ్లు బంధించి నానా నానా తిప్పలు పెట్టాడు. 

రష్యాలో అత్యంత దారుణమైన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.  పశ్చిమ రష్యాలోని చెల్యాబిన్స్క్‌లో వ్లాదిమిర్ చెస్కిడోవ్(51)  అనే రాక్షస  వ్యక్తి .... ఎకటరీనా అనే యువతిని 2009లో కిడ్నాప్   చేశాడు.  పార్టీకి  రమ్మని ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెను బయటకు వెళ్లకుండా  బెడ్రూంలో నిర్బంధించాడు. దాదాపు 1000కి పైగా సార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. కత్తితో బెదిరిస్తూ, ఇంట్లో పనులు చేయించుకునేవాడు. ఆ రాక్షసుడు  యువతికి మాయమాటలు చెప్పి ఇంటికి పిలిపించి.. ఆమెను బంధించి, 14 సంవత్సరాలపాటు చిత్రహింసలకు గురి చేశాడు.  ఆమెపై పైశాచికత్వం ప్రదర్శిస్తూ, నరకం చూపించాడు. చివరికి ఎలాగోలా ఆమె ఆ రాక్షసుడి చెర నుంచి బయటపడి పోలీసుల్ని ఆశ్రయించింది. 

ఆ రాక్షసుడి బారి నుంచి తప్పించుకోవడం కోసం ఎకటరీనా ప్రయత్నించింది కానీ, ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. చివరికి ఆమె దీనస్థితిపై జాలి కలిగి.. వ్లాదిమిర్ తల్లి ఆమెను విడిపించడంలో సహాయం చేసింది. ఆమె సహకారంతో ఎకటరీనా ఆ నరకం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమె వయసు 33 సంవత్సరాలు. బయటకొచ్చిన వెంటనే పోలీసుల్ని ఆశ్రయించి, జరిగిన ఉదంతాన్ని వివరించింది. . తనను బందించిన ఇంటికే మరో మహిళని వ్లాదిమిర్ తీసుకొచ్చాడని, తనతో గొడవ పడిన కారణంగా ఆమెను 2011లో కత్తితో అనేకసార్లు పొడిచి కిరాతకంగా చంపాడని వెల్లడించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. నిందితుడు వ్లాదిమిర్‌ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుడు ఇంటికి వెళ్లి పరిశీలించగా అక్కడ పోలీసులకు భయంకరమైన వస్తువులు కనిపించాయి. సెక్స్ టాయ్స్, అసభ్యకరమైన  వీడియోలతో ఆ ఇల్లు  మొత్తం నిండి ఉండటం చూసి వాళ్లు ఖంగుతిన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. మానవ అవశేషాలు కూడా అక్కడ కనిపించాయి. దీంతో.. అతనిపై అత్యాచారం, హత్య, కిడ్నాప్ ఆరోపణలపై కేసు నమోదు చేశాడు.