రష్యాలో కుప్పకూలిన యుద్ధ విమానం.. 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు మృతి

రష్యాలో కుప్పకూలిన యుద్ధ విమానం.. 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు మృతి

రష్యాకు చెందిన ఇల్యూషిన్ ఇల్ -76 సైనిక రవాణా విమానం బుధవారం (జనవరి 25) ఉక్రెయిన్ సరిహద్దులో కుప్పకూలింది. రష్యా బందీల మార్పిడి కోసం 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను తీసుకెళ్తండగా విమానం కూలిపోయినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 

విమానం కూలిపోయినప్పుడు ఆరుగురు సిబ్బంది, ముగ్గురు గార్డులతో సహా 74 మంది ప్రయాణిస్తున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రమాదంలో కారణాలు వెల్లడించలేదు. మూడు క్షిపణుల ద్వారా విమానాన్ని కూల్చివేశారని రష్యా పార్లమెంటులో శాసన సభ్యుడు, రిటైర్డ్ జనరల్ ఆండ్రీ కర్టపోలోవ్ పార్లమెంటరీ సమావేశంలో  చెప్పారు. అయితే తన సమాచారంపై స్పష్టత ఇవ్వలేదు. 

యుద్ధ ఖైదీలతో ప్రయాణిస్తున్న రష్యా యుద్ద విమానం బెల్గోరోడ్  ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 65 మంది యుద్ద ఖైదీలు మృతిచెందినట్లు ప్రకటించింది. మాస్కో సమయం ప్రకారం.. 11.00 గంటలకు IL-76 విమానం బెల్గోరోడ్ ప్రాంతంలో కూలిపోయిందని.. బోర్డులో 65 మంది ఉక్రెయిన్ ఆర్మీ సర్వీస్ మెన్లను బెల్గోరోడ్ ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరితోపాటు ఆరుగురుసిబ్బంది, ముగ్గురు ఎస్కార్ట్ లు ఉన్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే విమానం క్రాస్ కి గల కారణాలు ఇంకా తెలిసిరాలేదు.