మూన్ ల్యాండింగ్ మిషన్ కోసం.. రష్యాలో మొత్తం ఊరు ఖాళీ

మూన్ ల్యాండింగ్ మిషన్ కోసం..  రష్యాలో మొత్తం  ఊరు ఖాళీ
  •     ఈ నెల11న మిషన్ ను చేపట్టనున్న రష్యా స్పేస్​ ఏజెన్సీ

మాస్కో : రష్యా స్పేస్  ఏజెన్సీ రాస్ కాస్మోస్  ఈ నెల 11న చేపట్టనున్న లూనార్  ల్యాండింగ్  మిషన్  కోసం ఒక గ్రామం మొత్తాన్ని అధికారులు ఖాళీ చేయించనున్నారు. ఖాబార్ వోస్క్  ప్రాంతంలోని షాఖ్ తిన్ స్కీ గ్రామస్తులను అక్కడి నుంచి తరలించనున్నారు. ఈ ప్రాంతం నుంచే లూనార్  ల్యాండర్  మిషన్  చేపట్టనున్నారు. రాకెట్  బూస్టర్లు విడిపోయాక ఈ గ్రామం ఉన్న పరిసర ప్రాంతాల్లోనే పడతాయని అంచనా వేశారు. దీంతో ముందుజాగ్రత్తగా గ్రామస్తులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఉమాల్టా, ఎస్సామఖ్, లెపికన్, తాస్తఖ్, సాగానర్  నదులతో పాటు బురేవా నది కూడా ప్రెడిక్టెడ్ జోన్ (రాకెట్  బూస్టర్లు పడే ప్రాంతం) లోనే ఉందని సైంటిస్టులు తెలిపారు. కాగా, గత 50 ఏండ్లలో రష్యా మొదటిసారిగా మళ్లీ లూనార్  ల్యాండర్  మిషన్ చేపట్టింది. ఈ మిషన్ కు లూనా 25 అని పేరు పెట్టారు. రాజధాని మాస్కోకు తూర్పున 5,550 కిలోమీటర్ల దూరంలో ఉన్న వోస్తోక్ ని కాస్మోడ్రోమ్  నుంచి ఈ ల్యాండర్ ను అంతరిక్షంలోకి పంపనున్నారు.