ఎక్కువ మంది పిల్లలను కనండి: రష్యా అధ్యక్షుడు పుతిన్

ఎక్కువ మంది పిల్లలను కనండి: రష్యా అధ్యక్షుడు పుతిన్

మాస్కో: తమ దేశంలోని మహిళలు ఎనిమిది, అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను కనాలని, పెద్దకుటుంబాలుగా విస్తరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ పిలుపునిచ్చారు. ఇటీవల మాస్కోలో జరిగిన ‘వరల్డ్‌ రష్యన్‌ పీపుల్’ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1990 నుంచి రష్యాలో జననాల రేటు పడిపోయిందని, ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి సుమారు మూడు లక్షలకు పైగా ప్రాణనష్టం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో రష్యా జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని దేశ మహిళలను కోరారు.‘పాత తరంవారు నలుగురు, ఐదుగురు పిల్లల్ని కనడం వల్లనే మన సమాజం బలంగా ఉంది. మన అమ్మమ్మలు, నానమ్మలకు ఎనిమిది మంది పిల్లలు ఉండేవారనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సంప్రదాయాన్ని మనం కాపాడుకుందాం. పెద్ద కుంటుంబాలుగా ఉండటం అనేది దేశంలో ప్రామాణికంగా మారాలి. కుటుంబం అనేది కేవలం సమాజానికి పునాది మాత్రమే కాదు’అని అన్నారు. ఇది ప్రపంచంలో రష్యాని బలోపేతం చేస్తుందని పుతిన్ తెలిపారు.