భారత సంప్రదాయంలో రష్యన్ జంట పెళ్లి

భారత సంప్రదాయంలో రష్యన్ జంట పెళ్లి

కాశమంత పందిరి. చుట్టూ వందల మంది ఆత్మీయులు. తప్పెట్లు..తాళాలు. వేద మంత్రాలు.. వాటన్నింటి మధ్య పట్టుచీరతో మండపం వైపు నడిచొస్తుంది  పెండ్లికూతురు. చేతినిండా రంగురంగుల గాజులు.. ఎర్రటి ముక్కెర, పాపిట బిళ్లతో అందమే మురిసిపోయేలా ఉందామె. పంచెకట్టులో.. నుదుటన తిలకంతో వధువు వైపు అడుగులేస్తున్నాడు పెండ్లి పిలగాడు. ఇది ప్రతి పెండ్లిలో జరిగేదేగా.. అవును, కాకపోతే ఈ పెండ్లి కాస్త స్పెషల్​. ఈ ఇండియన్​ స్టైల్​ వెడ్డింగ్​ జరిగింది రష్యాలో. పెండ్లి పిల్లగాడు, పిల్ల కూడా రష్యాలోనే పుట్టి, పెరిగారు. 
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న రష్యన్​ కపుల్​కి మన​ కల్చర్​ బాగా నచ్చిందట. ముఖ్యంగా ఇక్కడ జరిగే పెండ్లి వేడుకలు, ఆచారాలు చాలా నచ్చాయి. దాంతో ఇండియన్​ స్టైల్​లోనే పెండ్లి చేసుకోవాలనుకున్నారు. దాంతో రష్యాలోనే  ఇండియన్​ స్టైల్​​ పెండ్లికి ఏర్పాట్లు చేశారు. పెండ్లి కూతురు చేతికి మెహందీ, కాళ్లకి పట్టీలు, మెడకి చోకర్​, నడుముకి వడ్డాణం పెట్టుకుని అచ్చం ఇండియన్​ పెండ్లి కూతురులాగే తయారైంది. పెండ్లి కొడుకు కూడా పంచెకట్టులో వచ్చాడు. వరమాల, సప్తపది, కన్యాదానం, మేళతాళాలు  ఇలా ప్రతి సంప్రదాయాన్ని పెండ్లిలో పాటించారు వీళ్లు. ఈ పెండ్లికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో అందరి మనసు దోచు కుంటోంది. కోట్లలో లైకులు వస్తున్నాయి ఈ స్పెషల్​ వెడ్డింగ్​కి​. దాంతో ఈ వీక్​ ఇంటర్నెట్ సెన్సేషన్​ అయ్యారు ఈ రష్యన్​ కొత్త కపుల్​.