అబుదాబి వెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఎస్కార్ట్గా యుద్ద విమానాలు

అబుదాబి వెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఎస్కార్ట్గా యుద్ద విమానాలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం( డిసెంబర్ 6) యూనైటెడ్  అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలో పర్యటించారు. చమురు, గాజా, ఉక్రెయిన్ వివాదాలపై సౌదీ అరేబియా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తో పుతిన్ చర్చలు జరిపారు. అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య  పుతిన్ విదేశీ పర్యటనకు వెళ్లారు.. తాను ప్రయాణిస్తున్న విమానానికి ఎస్కార్ట్ గా యుద్ద విమానాలను తీసుకెళ్లారు పుతిన్. పర్యటన, చర్చలు ఒక వైపు అయితే.. మరోవైపు పుతిన్ పర్యటనకు సంబంధించి రష్యా మంత్రిత్వ శాఖ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. భారీ భద్రత మధ్య పుతిన్ విదేశీపర్యటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

యూఏ ఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్వాన్  సమావేశమైన రష్యా అధ్యక్షఉడు పుతిన్.. పలు కీలక అంశాలపై చర్చించారు. చమురు, ఒపెక్, గాజా, ఉక్రెయిన్  లోని వివాదాలపై చర్చలు జరిపారు. ఇంధన సమస్యలతోపాటు, పాశ్చాత్య దేశాలతో పొత్తులను ఏర్పరుచుకునేందుకు పుతిన్ విదేశీ పర్యటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ వివాదంలో ఆంక్షలతో రష్యాను ఒంటరిని చేయడంలోఅమెరికా, దాని మిత్ర దేశాలు విఫలం అయ్యాయని చెప్పేందుకు ఈ పర్యటన ద్వారా రష్యా అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.