రష్యా లో క్లాస్​మేట్​ను..కాల్చిచంపిన బాలిక

రష్యా లో క్లాస్​మేట్​ను..కాల్చిచంపిన బాలిక

మాస్కో:  రష్యా, బ్రయాన్స్క్ సిటీలోని ఓ స్కూల్​లో తోటి స్టూడెంట్​ను ఓ బాలిక గన్​తో కాల్చి చంపింది. తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలైనట్లు రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ తెలిపింది. 14 ఏండ్ల అమ్మాయి షాట్​గన్​తో స్కూల్​కు వచ్చి, ఈ దారుణానికి పాల్పడిందని అధికారులు తెలిపారు.

క్లాస్​మేట్​పై ఎందుకు కాల్పులు జరిపిందో కారణం తెలియలేదన్నారు. గాయపడిన ఐదుగురు స్టూడెంట్స్ ను దగ్గర్లోని హాస్పిటల్​కు తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కాల్పులు జరిపిన స్టూడెంట్ రైట్ షూలో పొడవాటి కత్తిని కూడా గుర్తించినట్లు తెలిపారు.