
పూర్వ కాలంలో భర్తే దైవమని తలిచేవారు భార్యలు. భర్త ఇష్టాలను తమ ఇష్టాలుగా మల్చుకొనేవారు.కాలం మారిన కొద్దీ ఎవరి ఇష్టాలకనుకుగుణంగా వారు నడుచుకోవడం మొదలు పెట్టారు. అయితే రష్యాలో యన అనే మహిళ భర్త .. ఆమె చాలా లావుగా ఉందని.. బరువు తగ్గించుకోమని ఒత్తిడి చేయడంతో తిండి తినడం మానేసి డైటింగ్ చేసింది. ఇంకేముంది... 45 కిలోలు ఉన్న యన 22 కిలోలకు తగ్గిపోయింది. ఉబ్చిన బుగ్గలు.. చక్కటి రంగు, అందంతో ఉండే రష్యన్ మహిళ .. శాడిస్ట్ భర్త వ్యాఖ్యలతో.. కడుపు నిండాతిండి తినకపోవడంతో.. ఆకలితో మల మల మాడి.. శరీరం పాలిపోయి.. నడిచే అస్థిపంజరంగా మారింది.
రష్యా నివాసి యానా బొబ్రోవా అనే మహిళకున్న ఉబ్బిన బుగ్గలు నచ్చలేదని ఆమె భర్త చేసిన వ్యాఖ్యలతో డైటింగ్ చేసి తన బరువును బాగా తగ్గించుకొని.. నడిచే అస్థిపంజరంలా తయారైంది. ప్రపంచంలో రక రకాల వ్యక్తులు ఉంటారు. వారి ఇష్టాలను వేరే వారి మీద రుద్దుతారు. అవకాశం ఉంటే అలా ఉండాలి..ఇలా ఉండాలి అని ఒత్తిడి కూడా చేస్తుంటారు. రష్యాలో ఓ వ్యక్తి తన భార్య శరీరం ఎలా ఉండాలో ఓ భర్త నిర్దేశిస్తాడు. భర్త ఒత్తిడి తట్టుకోలేక రష్యాలో ఓ మహిళ తనను తాను అస్థిపంజరంగా మార్చుకుంది.
దక్షిణ- పశ్చిమ రష్యాలో నివసిస్తున్న యానా బోబ్రోవా అనే మహిళ తన భర్త ఆనందం కోసం ఆకలిని చంపుకుంది. ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్న యనను ఇప్పుడు చూస్తే.. మనిషా.. లేక అస్థి పంజరమా అనుమానం వస్తుంది. సాధారణంగా నాలుగైదు సంవత్సరాల పిల్లలు 22 కిలోలు బరువు ఉంటారు. ఇప్పుడు ఆమె బరువు కూడా అంతే ఉంది. గతంలో ఉబ్బిన బుగ్గలతో చలాకీగా ఉండే యన .. భర్త వింత వ్యాఖ్యలతో ఇలా తయారైంది.
సాధారణంగా ఈ మహిళ బరువు 45 కిలోలు ఉంటుంది. ప్రస్తుతం బెల్‌గ్రేడ్ నివాసి యాన బొబ్రోవా 5.2 అడుగుల ఎత్తు మరియు 22 కిలోల బరువు మాత్రమే ఉంది. యన శరీరం పాలిపోయి పొడిగా కనిపిస్తుంది. ఉబ్బిన బుగ్గలపై భర్త వ్యాఖ్యానించడంతో తాను డైటింగ్ ప్రారంభించానని ఆ మహిళ చెబుతోంది. తన భర్త తన బుగ్గలపై వ్యాఖ్యానించాడని, నెమ్మదిగా తన విశ్వాసాన్ని దెబ్బతీశాడని స్థానిక మీడియాకు తెలిపింది. అయితే చదువుకొనే రోజుల్లో కూడా బరువు తగ్గాలని తాను అనుకున్నానని చెప్పింది. ఆమె చాలా వ్యాయామం,డైటింగ్ అలవాటు చేసుకుంది. తర్వాత భర్త కోరిక మేరకు బరువు తగ్గించుకుని క్రమంగా అస్థిపంజరంలా మారింది. ఆమె ఆరోగ్యం రోజు రోజుకు దిగజారుతున్నా భర్త మాత్రం యన ఆరోగ్య విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించలేదు. భర్త కోసం యన ఆమె జీవితాన్ని నాశనం చేసుకుంది, ఉద్యోగం నుంచి కూడా తీసేయడంతో.. ఇప్పుడు ఒంటరిగా ఉన్న ఆ మహిళ పౌష్టికాహారలోపానికి గురైంది.