
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నా పోలింగ్ కు ఈవీఎంలే ఉపయోగిస్తామన్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్. 64 మంది అభ్యర్థులు దాటితే M3 ఈవీఎంలు ఉపయోగిస్తామని.. బ్యాలెట్ పేపర్స్ ఓటింగ్ ఉండబోదన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. సరైన ఫార్మాట్ లో పత్రాలు సమర్పించకపోవడం,వివరాలు అసంపూర్తిగా ఉండటం వంటి కారణాలతో 30 మంది అభ్యర్థులకు చెందిన 59 సెట్ల నామినేషన్లు అధికారులు తిరస్కరించారు. 39 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్లు ఆమోదించారు అధికారులు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 24 వరకు సమయం ఉన్నందును తుది బరిలో ఎంత మంది నిలుస్తారనేది తెలవనుంది.
కాంగ్రెస్,బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని బీఆర్ఎస్, జూబ్లీహిల్స్ లో గెలవాలని అధికార పార్టీ, సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ .. 14న కౌంటింగ్ జరగనుంది.