రైతుబంధు నమోదు గడువు 20 వరకు పొడిగింపు

రైతుబంధు నమోదు గడువు 20 వరకు పొడిగింపు

హైదరాబాద్, వెలుగు: కొత్తగా పట్టాదారు పాస్‌‌బుక్‌‌లు వచ్చిన వారు రైతుబంధు కోసం నమోదు చేసుకునే చాన్స్ వ్యవసాయశాఖ కల్పించింది. 2020 యాసంగి రైతుబంధుకు గైడ్​లైన్స్ రిలీజ్ చేసింది. ఈనెల 20వ తేదీలోగా రైతులు అకౌంట్ వివరాలను ఏఈవోలకు ఇవ్వాలని సూచించింది. డిసెంబరు 10 నాటికి ధరణి లో నమోదైన రైతుల వివరాలు సీసీఎల్‌‌ఏ ద్వారా రైతు బంధు పోర్టల్​కు అందాయి. కొత్తగా పాస్‌‌బుక్‌‌ వచ్చి వివరాలు ఇవ్వని రైతులు  అప్లికేషన్ ఫారం, పట్టాదారు పాస్ బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలను ఏఈవోలను ఇవ్వాలని చెప్పింది. వానాకాలంలో రైతు బంధు వచ్చిన రైతులు మళ్లీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్యాంకు సమస్యలు ఉన్న రైతులు అకౌంట్ ను మార్చుకోవాలని అనుకునే వారు వ్యవసాయ శాఖ ఆఫీస్​లో పట్టాదారు పాస్‌‌బుక్‌‌, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది.