పారిస్: బెలారస్ స్టార్ ప్లేయర్, వరల్డ్ నంబర్‌వన్ అరీనా సబలెంక.. ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం (మే 30) జరిగిన విమెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో టాప్‌సీడ్ సబలెంక 6–0, 7–5తో డారియా కసాట్కినా (ఆస్ట్రేలియా)పై గెలిచింది. దాంతో వరల్డ్ నంబర్‌వన్ ప్లేయర్‌గా వందో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఇతర మ్యాచ్‌ల్లో నవోమి ఒసాక (జపాన్) 7–6 (7/5), 6–7 (3/7), 6–4తో ఇవా జోవిచ్ (అమెరికా)పై, మజా చువాలిన్‌స్కా (పోలెండ్) 1–6, 6–3, 6–2తో మరియా సకారి (గ్రీస్)పై, ప్యారీ (ఫ్రాన్స్) 6–3, 4–6, 7–6 (10/3)తో అన్సిమోవా (అమెరికా)పై, ష గెలిచారు.
మెన్స్ సింగిల్స్‌లో ఫ్లావియో కొబలీ (ఇటలీ) 6–2, 6–2, 6–3తో లెర్నర్ టియోన్ (అమెరికా)పై, బెరెటినీ (ఇటలీ) 7–6 (7/3), 5–7, 6–7 (4/7), 6–4, 7–6 (15/13)తో ఫ్రాన్సిస్కో కొమెసనా (అర్జెంటీనా)పై నెగ్గారు.
