
పారిస్: వరల్డ్ నంబర్‌వన్ అరీనా సబలెంక, నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ ఇగా స్వైటెక్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో టాప్‌సీడ్ సబలెంక (బెలారస్) 7–6 (7/3), 6–3తో క్విన్వెన్ జెంగ్ (చైనా)పై గెలిచి రెండోసారి లాస్ట్–4 రౌండ్‌కు చేరింది. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో ఐదోసీడ్ ఇగా స్వైటెక్ (పోలెండ్) 6–1, 7–5తో ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్)ను ఓడించి సబలెంకాతో అమీతుమీకి సిద్ధమైంది. మెన్స్ క్వార్టర్ఫైనల్లో లోరెంజో ముసెటీ (ఇటలీ) 6–2, 4–6, 7–5, 6–2తో ఫ్రాన్సెస్ తియాఫో (అమెరికా)పై నెగ్గి సెమీస్‌లోకి అడుగుపెట్టాడు.