కాచిగూడలో శబరిమల ఇన్ఫర్మేషన్ సెంటర్

కాచిగూడలో శబరిమల ఇన్ఫర్మేషన్ సెంటర్

బషీర్ బాగ్, వెలుగు: శబరిమలకు వచ్చే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఆనంద్ గోపాలన్ అన్నారు. శనివారం ఆయన శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కాచిగూడలో శబరిమల ఇన్ఫర్మేషన్ సెంటర్ ను  ప్రారంభించారు. ఈ సందర్భంగా టోల్ ఫ్రీ నంబర్ 18005719984 ను  ప్రకటించారు. ఈ సెంటర్ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని... శబరిమల ఆలయ సమాచారం, పూజ  వంటి తదితర విషయాలను ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా తెలుసుకోవచ్చునని చెప్పారు.

తెలుగు భక్తులకు తమ ట్రస్ట్ ద్వారా శబరిమలలో అన్నదానం , వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు విజ్ఞేశ్ తెలిపారు. ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏడాది పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో  ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కార్యదర్శి బైజు, సభ్యులు జీవన్, సుదర్శన్, బోర్డు కమిషనర్ బీఎస్ ప్రకాశ్ , శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవ ట్రస్ట్ వ్యవస్థాపకుడు తెలు శ్రీనివాస్ , చైర్మన్ కళ్యాణ్ చక్రవర్తి , రాష్ట్ర కార్యదర్శి జంగం శ్రీనివాస్ , కోశాధికారి ఎమ్ రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.