
ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం రానుందని ఆపార్టీ నేత సబ్బం హరి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు టీడీపీకి ఇచ్చిన మద్ధతు అపూర్వం అని కొనియాడారు. టీడీపీకి కేంద్రంతో ఘర్షణ తప్పే పరిస్థితిలో లేదని ఆయన అన్నారు. ఎన్నికలలో మనీ పంచడానికి తాను వ్యతిరేకం అని… అయితే ప్రస్తుత రాజకీయాలలో నగదును పంచడం తప్పడంలేదని చెప్పారు.
అమరావతి గ్రాఫిక్స్ కే పరిమితం అయిందన్న వారిపై విరుచుకుపడ్డారు సబ్బం హరి. అమరావతిని కట్టడం అంటే అంత సులువైన పని కాదన్నారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతుందనే.. తాను టీడీపీలో చేరానన్నారు. రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారని కితాబిచ్చారు. ప్రతీ వర్గానికి చంద్రబాబు మేలు చేశారని తెలిపారు.