సర్ పై అప్రమత్తంగా ఉండాలి : ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్

సర్ పై అప్రమత్తంగా ఉండాలి : ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్

హైదరాబాద్, వెలుగు: సర్ రెండో దశపై బీఎల్ఏలతోపాటు పార్టీ నాయకులంతా అప్రమత్తంగా ఉండాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ సూచించారు. మంగళవారం గాంధీ భవన్ లో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ పీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సచిన్ సావంత్ మాట్లాడుతూ సర్ ప్రక్రియను నిశితంగా గమనించాలన్నారు. అర్హులైన ఏ ఒక్కరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా చూసే బాధ్యతను పార్టీ నేతలు తీసుకోవాలని చెప్పారు. 

పార్టీ మండల, గ్రామ కమిటీలను వెంటనే నియమించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, ఇతర నేతలు పాల్గొన్నారు.